సీఎం విజయ్‌ని కలిసిన కమల్ హాసన్... ఆరు డిమాండ్లతో కూడిన లేఖ అందజేత

  • సీఎం, సోదరుడు విజయ్‌ని కలిసిన కమల్ హాసన్
  • విజయ్ తన కలలు, ఆలోచనలను పంచుకున్నారన్న కమల్ హాసన్
  • నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయని వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని విలక్షణ నటుడు కమల్ హాసన్ కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి 'గాంధీ బిఫోర్ ఇండియా' పుస్తకాన్ని అందించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా కమల్ హాసన్ ఫొటోలను పంచుకున్నారు.

"ఈరోజు నేను గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్‌ని కలిశాను. వారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. తమిళనాడు అభివృద్ధి కోసం ఆయన కన్న కలలు, ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత నన్ను గర్వపడేలా చేశాయి" అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ క్రమంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సాయం అవసరమని పేర్కొంది. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చి, దీనితో పాటు, ఆరు ముఖ్య డిమాండ్లను ముఖ్యమంత్రి విజయ్ ఎదుట ఉంచినట్లు తెలిపారు. అంతా మంచే జరగాలని ముగించారు.

Vijay
Tamil Nadu
Kamal Haasan
Tamil Nadu Chief Minister
Tamil Cinema
Gandhi Before India

More Telugu News